: మే 31న భూమి మీదుగా నల్లటి, భారీ ఆస్టరాయిడ్‌


అది సుమారు 3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దాని ఉపరితలం మొత్తం నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. అది గనుక భూమండలాన్ని ఢీకొన్నట్లయితే.. యావత్తు ప్రపంచం నామరూపాల్లేకుండా పోవాల్సిందే.. అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే.. అది ఢీకొనడం లేదు. భూమి పక్కగా వెళ్లిపోబోతోంది.

ఆస్టరాయిడ్‌ 1998 క్యుఇ 2 అనేది మే 31 వ తేదీన భూమికి అత్యంత సమీపంనుంచి వెళ్లనుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 15 ఏళ్ల కిందటే కనుగొన్న ఈ అసాధారణమైన అతపెద్ద బండరాయి.. ఎక్కడినుంచి వచ్చిందనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటిదాకా తేల్చలేకపోయారు. కానీ సూర్యుడికి అత్యంత సమీపంనుంచి ఓ తోకచుక్క ఎగరడం వలన ఇది ఏర్పడి ఉండవచ్చునని... ఆమీ మైంజర్‌ చెబుతున్నారు. లా కెనడా ఫ్రింట్‌రిడ్జ్‌ లోని జెట్‌ ప్రొపల్షన్‌ ప్రయోగశాలలో వారు భూమి సమీపంలోని ఆబ్జెక్ట్‌ గురించి పరిశీలిస్తుంటారు.

  • Loading...

More Telugu News