: రిటైర్మెంట్‌ ‘ఆరోగ్యానికి హానికరం’


రిటైర్‌మెంట్‌ అనేది మానసికంగానూ, భౌతికంగానూ కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ ఎఫైర్స్‌ వారు నిర్వహించిన ఒక అధ్యయనంలో రిటైర్‌మెంట్‌ వలన వ్యక్తుల ఆరోగ్యం హఠాత్తుగా పడిపోతుందని... దీర్ఘకాలంపాటూ కూడా ఈ సమస్య ఉంటుందని తేలింది. ఈ అధ్యయనం ద్వారా ఐఈఏ వారు.. ఎక్కువ కాలం ఆరోగ్యంగా మనగలగాలంటే.. మనం ఎక్కువ కాలంపాటూ పనిచేస్తూ ఉండాలని సూచిస్తున్నారు. దీనివలన... ఎక్కువ కాలం వరకూ ఆదాయం పొందుతూ ఉండవచ్చునని కూడా అంటున్నారు.

సాధారణంగా రిటైర్‌మెంట్‌గా పరిగణించే వయస్సు దాటిన తర్వాత.. ఏదో ఒక పనిచేస్తూ గడుపుతున్న వారిని, పూర్తి ఖాళీగా ఉంటున్న వారిని పోల్చి.. వీరు ఈ అధ్యయనం సాగించారు. ఈ కార్యక్రమం డైరక్టర్‌ ఫిలిప్‌ బూత్‌ మాట్లాడుతూ... ప్రభుత్వం ఇలాంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలని, కార్మికులు, ఉద్యోగులు మరింత కాలం పాటు పనిచేసేలా చర్యలుండాలని పేర్కొన్నారు.

రిటైర్‌మెంట్‌ అంటే 58 దాటగానే.. ఇంటికి వచ్చేయగానే ఆరోగ్యం పాడవుతుందని కాదు. ఏదో ఒక పనిలో నిమగ్నం అయి ఉన్నంత వరకూ పనిచేస్తున్నట్లే లెక్క. పెద్దాళ్లం అయిపోయాం అనుకుంటూ పూర్తి ఖాళీగా కూర్చోవడం అలవాటైతే మాత్రం.. మన ఆరోగ్యానికి మనమే చెడుచేసుకుంటున్నట్లు.

  • Loading...

More Telugu News