రాజధానుల అంశం కేంద్రానికి సంబంధించిన విషయం కాదు: మంత్రి పెద్దిరెడ్డి
- రాజధాని రాష్ట్ర పరిధిలోని విషయమన్న పెద్దిరెడ్డి
- సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వెల్లడి
- అమరావతిలో రైతులు ఎవరూ లేరని వ్యాఖ్యలు
ఏదేమైనా సీఎం జగన్ నిర్ణయమే తమకు శిరోధార్యమని తెలిపారు. అమరావతిలో ఆందోళనలు చేస్తున్నవారు టీడీపీ కార్యకర్తలేనని, అమరావతిలో రైతులు ఎవరూ లేరని మంత్రి పేర్కొన్నారు. ఓ పార్టీకి చెందిన ఒకే సామాజికవర్గం వారు మాత్రమే అమరావతిలో భూములు కొన్నారని ఆరోపించారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.