ఈ కారణంతోనే అమరావతిని ప్రజా రాజధాని అంటున్నారు: గల్లా జయదేవ్
- ఏపీకి మూడు రాజధానులంటున్న సీఎం!
- స్పందించిన గల్లా జయదేవ్
- రాజధాని సులువుగా చేరుకునేలా ఉండాలన్న గల్లా
"ఏపీకి దక్షిణ ప్రాంతంలో ఉన్న కుప్పం నుంచి వైజాగ్ వెళ్లాలంటే 950 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. కానీ కుప్పం నుంచి అమరావతికి 598 కిలోమీటర్లే. ఉత్తరాంధ్రలో చివరన ఉన్న ఇచ్ఛాపురం నుంచి కర్నూలు రావాలంటే 917 కిలోమీటర్లు ప్రయాణించాలి, కానీ ఇచ్ఛాపురం నుంచి అమరావతికి 615 కిలోమీటర్లే. అందుకే అమరావతి ప్రజా రాజధాని అయింది" అని ట్వీట్ చేశారు.