Telugudesam: వైసీపీ నేతల తీరు ఆక్షేపణీయం: చంద్రబాబు
- ఏపీలో వైసీపీ నేతలు చెబితేనే కార్యాలయాల్లో పనులు జరిగే పరిస్థితి ఉంది
- పోలీసు వ్యవస్థ విశ్వసనీయత శాశ్వతంగా ఉండాలి
- మా హయాంలో ఎస్సీలకు న్యాయం జరిగింది
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు వైసీపీ నేతలు చెబితేనే జరిగే పరిస్థితి నెలకొందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ నేతల తీరు ఆక్షేపణీయమన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నీరుగారిపోయే పరిస్థితి నెలకొందని ఆరోపించారు.
తమ హయాంలో ఎస్సీలకు న్యాయం జరిగిందన్నారు. ‘పోలీసు వ్యవస్థ విశ్వసనీయత శాశ్వతంగా ఉండాలి. ఎస్సీలకు అన్యాయం జరిగినట్లు భావిస్తే అందరికీ సమన్యాయం చేయాలి. జస్టిస్ పున్నయ్య ఆధ్వర్యంలో వాస్తవాల అధ్యయనం జరిగింది. సామాజిక న్యాయం కోసం కేటగిరీలు ఉండాలి. రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందాలనే ఏ,బీ,సీ,డీ కేటగిరీలు తెచ్చాం’ అని అన్నారు.