: చాకో వర్సెస్ కేకే
తెలంగాణ అంశం యూపీఏ అజెండాలో లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో వ్యాఖ్యానించడంపై రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కె. కేశవరావు స్పందించారు. రెండు నెలల క్రితం తెలంగాణకు మద్దతుగా మాట్లాడిన చాకో.. ఇప్పుడు ప్లేటు ఫిరాయించడం తగదని హితవు పలికారు. చాకో తాజా వ్యాఖ్యలు అసంబద్ధమైనవని కేకే అభిప్రాయపడ్డారు. అవివేకంతో కూడిన ఇలాంటి పొంతనలేని మాటలతో కాంగ్రెస్ పార్టీని ప్రజలు చులకనగా చూస్తారని అన్నారు.