: గిల్ క్రిస్ట్ కు ఘనంగా వీడ్కోలు
ఈ ఐపీఎల్ సీజనే తనకు చివరిదని ప్రకటించిన తమ కెప్టెన్ ఆడమ్ గిల్ క్రిస్ట్ కు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సభ్యులు విజయాన్ని కానుకగా అందించారు. తద్వారా తమ సారథికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సాయంత్రం ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టు 50 పరుగుల తేడాతో పటిష్టమైన ముంబయి ఇండియన్స్ ను చిత్తు చేసింది. పంజాబ్ విసిరిన 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. 19.1 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటయ్యారు.