: ఫిక్సర్లకు గోరు చుట్టు మీద రోకటి పోటు


ఫిక్సింగ్ కు పాల్పడి పరువుపోగొట్టుకుని, భవిష్యత్తు నాశనం చేసుకుని, జైళ్లలో ఉన్న క్రికెటర్లను మరిన్ని కష్టాలు చుట్టుముట్టనున్నాయి. ఇప్పటికే పొలీసులు మోసం, వంచన, అక్రమ ఆస్తులు, అవినీతి వంటి కేసులు పెట్టగా తాజాగా వీరిపై బీసీసీఐ చర్యలు తీసుకునేందుకు సన్నద్దమౌతోంది. ఆ ముగ్గురు క్రికెటర్లపై క్రిమినల్ కేసులు పెట్టనుందని బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ తెలిపారు. వారిపై చర్యలు, ఐపీఎల్ పరిరక్షణ వంటి అంశాలపై రేపు అత్యవసరంగా బీసీసీఐ చెన్నైలో సమావేశం అవనుంది. దీంతో ఫిక్సింగుకు పాల్పడిన క్రికెటర్ల పరిస్థితి గోరుచుట్టు మీద రోకటి పోటులా తయారైంది.

  • Loading...

More Telugu News