: సోమవారం నుంచి 'సీరియల్' చూపిస్తా: రఘునందన్


టీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కీలక నేత రఘునందన్ రావు.. కేసీఆర్ అండ్ గ్యాంగ్ తో సాగిస్తోన్న పోరాటం రసపట్టులో పడింది. టీఆర్ఎస్ అవినీతి భాగోతాలకు సంబంధించి సోమవారం నుంచి రోజుకో ఆధారాన్ని బయటపెడతానని రఘునందన్ హెచ్చరించారు. పద్మాలయా స్టూడియో వ్యవహారంలో హరీశ్ కు రూ.80 లక్షల ముడుపులందాయని రఘునందన్ ఆరోపించగా.. ఈ వ్యవహారంపై స్పందించిన హరీశ్ రావు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘునందన్ నేడు డీజీపీ దినేశ్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

డీజీపీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని, ఈ విషయమై ఫిర్యాదు చేశానని తెలిపారు. టీఆర్ఎస్ అక్రమాలపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించినవారే తనకు ఆధారాలున్న సీడీలను అప్పగించారని రఘునందన్ వివరించారు.

  • Loading...

More Telugu News