Jagan: ముగ్గురు సరిపోరు.. నలుగురు పెళ్లాలు కావాలని తాపత్రయపడుతున్నారు: అసెంబ్లీలో జగన్
- నాయకులు ఈ మధ్య కాలంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు
- 2014, 2015, 2016, 2017, 2018ల్లో ఇలాంటి వారిపై వందలాది కేసులు
- గత ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడుల కేసులు అధికంగా నమోదయ్యాయి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతోన్న నేరాల గురించి ప్రస్తావించారు. 'మహిళలపై దాడుల నిరోధానికి సలహా ఇవ్వమని అడిగితే చంద్రబాబు నాయుడు మా వైపు వేలెత్తి చూపిస్తున్నారు తప్పా ఏమీ సలహా ఇవ్వట్లేదు. ఆరు నెలల్లో ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదని అంటున్నారు. 'శాంతి, భద్రతలు లేకుండా పోయాయని అంటున్నారు.
మా ప్రభుత్వం వచ్చి ఆరు నెలలే అయింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పరిపాలన కొనసాగింది. ఆయన కాలంలో మహిళలపై వేలాది నేరాల కేసులు నమోదయ్యాయి. మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, వరకట్నం కేసులు వంటివి ఎన్నో నమోదయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో నేరాల రేటు అధికంగా ఉంది' అని జగన్ వ్యాఖ్యానించారు.
'చిన్నపిల్లలపై జరిగిన నేరాలపై కూడా వేలాది కేసులు నమోదయ్యాయి. ఇంక కొందరు ఉన్నారు అధ్యక్షా.. పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొంత మంది పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ మధ్య కాలంలో అధ్యక్షా.. ఒకరు సరిపోరు.. ఇద్దరు సరిపోరు.. ముగ్గురు సరిపోరు.. నలుగురు పెళ్లాలు కావాలని తాపత్రయపడుతున్నారు అధ్యక్షా.. ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారిపై 2014, 2015, 2016, 2017, 2018ల్లో వందలాది కేసులు నమోదయ్యాయి అధ్యక్షా' అని వ్యాఖ్యానించారు.