అదనపు కట్నం కోసం భార్య గొంతు కోసిన భర్త
- చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఘటన
- అదనపు కట్నం కోసం వేధింపులు
- భార్య పరిస్థితి విషమం
గత కొన్నాళ్లుగా హుస్సేన్వల్లి అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఇద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. అయినప్పటికీ తీరుమారని హుస్సేన్ శుక్రవారం మారోమారు అదనపు కట్నం కోసం వేధించాడు. అనంతరం కత్తితో భార్య గొంతు కోశాడు. వీపుపై పొడిచాడు. సల్మా గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి అతడిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని, పెనుగులాటలో గాయపడిన నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. సల్మా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి బెంగళూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.