: పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి
సాధారణంగా దొంగలు, కిడ్నాపర్లు, స్మగ్లర్లపై పోలీసులు దాడులకు దిగుతారు. పోలీసులకు ఇంకా బోరు కొడితే సాధారణ పౌరులు లేదా ఆడవాళ్ళపై దాడులకు దిగుతుంటారు. కానీ, ఇందుకు భిన్నంగా వీరే దాడికి గురయ్యారు. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో గస్తీ తిరుగుతున్న పోలీసులపై స్మగ్లర్లు రాళ్ళతో దాడి చేసారు. దాడి చేసిన వారిలో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో 32 మంది పరారీలో ఉన్నారు. వీరివద్ద నుంచి రంపాలు, గొడ్డళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.