ఆడియో ఫంక్షన్లలో పాటల రచయితకి ప్రాధాన్యత ఉండటం లేదు: రామజోగయ్య శాస్త్రి
- లిరిక్ రైటర్స్ కి ప్రాధాన్యత ఉండటం లేదు
- శ్రమకి తగిన గుర్తింపు రావడంలేదు
- అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటానన్న శాస్త్రి
ఇటు ఇండస్ట్రీ నుంచి .. అటు పబ్లిక్ నుంచి మా శ్రమకి తగిన గుర్తింపు రావడం లేదని గ్రహించాను. ఆడియో ఫంక్షన్ లిరిక్ రైటర్స్ కి సంబంధించినదే అయినప్పటికీ, అక్కడ మా పాత్ర అంతగా వుండటం లేదనేది అర్థమైంది. నన్ను గౌరవించడండి అని అడగడంకన్నా .. మన పనిని జనంలోకి తీసుకెళితే ఆ పనే కావాల్సినంత గౌరవాన్ని తీసుకొస్తుంది. అందువల్లనే నేను రాసిన పాటలను సోషల్ మీడియాలో పెడుతుంటాను. అందులోని సాహిత్యాన్ని గురించిన విషయాలను పంచుకుంటాను" అని చెప్పుకొచ్చారు.