: జగన్ పార్టీపై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి
అవినీతికి ఆలవాలమైన వైఎస్సార్సీపీ ఇప్పుడు కొత్త పల్లవి ఆలపిస్తోందంటున్నారు టీడీపీ ముఖ్యనేత రేవంత్ రెడ్డి. అవినీతికి పాల్పడిన మంత్రులపై టీడీపీ ఇన్నాళ్ళకు పోరాడుతోందని ఆ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని అన్నారు. కళంకిత మంత్రులను తొలగించాలనే అంశంపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి, గవర్నర్ లను కలిసి వినతి పత్రాలు అందజేయాలని రేవంత్ అన్నారు. సీబీఐవి చిలుక పలుకలని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్, తమవి కాకి పలుకులని గుర్తించాలని సూచించారు. జగన్ పార్టీ తప్పుడు వాదనలను సుప్రీం ఎప్పుడో తిరస్కరించిందని ఎద్దేవా చేశారు.