చర్లపల్లి జైలు వద్ద కూడా అదే సీన్... ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఆగ్రహజ్వాలలు!
- ప్రియాంక రెడ్డి ఘటనపై రగిలిపోతున్న ప్రజలు
- చర్లపల్లి వద్ద ఆందోళనలు
- ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జి
చర్లపల్లి కారాగారం వద్దకు వచ్చినవారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని వారిని వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు. ఆందోళనల నేపథ్యంలో జైలు వద్ద భద్రతను మరింత పెంచారు.