తమిళనాడులో భారీ వర్షాలు.. మూడు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
- తమిళనాడును కుమ్మేస్తున్న భారీ వర్షాలు
- కాంచీపురం, వెల్లూరు, చెంగల్పట్ జిల్లాల్లో విద్యాసంస్థలు బంద్
- మద్రాస్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా
ఇక, తిరువల్లూర్ విశ్వవిద్యాలయం సర్కడు, కాట్పడిలో నిన్న జరగాల్సిన పరీక్షలను డిసెంబరు 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా, గత 24 గంటల్లో మీనంబక్కంలో 45 మిల్లీమీటర్లు, నుంగంబక్కంలో 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేడు పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.