రూ.34,999కే 55 అంగుళాల 4కె టీవీని అందిస్తున్న షియోమీ!
- కొత్త మోడల్ తీసుకువచ్చిన షియోమీ
- రూ.34,999కే 55 అంగుళాల టీవీ
- ప్రముఖ బ్రాండ్లకు దీటుగా ఎంఐ టీవీ 4ఎక్స్ 55-2020 ఎడిషన్
సాధారణంగా 40 అంగుళాల పైబడిన టీవీల ధరలు రూ.40 వేల పైనే ఉంటాయి. శాంసంగ్, సోనీ, పానాసోనిక్, ఎల్జీ వంటి ప్రముఖ బ్రాండ్లు 4కె టెక్నాలజీ టీవీల ధరలను కాస్త భారీ స్థాయిలోనే వసూలు చేస్తున్నాయి. కానీ షియోమీ నమ్మశక్యం కాని రీతిలో 55 అంగుళాల భారీ స్క్రీన్ తో కూడిన కొత్త మోడల్ ను రూ.34,999 కే అందిస్తోంది.
అంతేకాదు, జనవరి 31 లోపు కొనుగోలు చేసినవారికి టీవీతో పాటు తక్కువ ధరకే ఎయిర్ టెల్ డీటీహెచ్ కనెక్షన్ కూడా ఇస్తోంది. వినియోగదారులు నాలుగు నెలల పాటు ఉచితంగా ప్రసారాలు అందుకోవచ్చు. ఎంఐ వెబ్ సైట్ లోనూ, అమెజాన్ పోర్టల్ లోనూ ఈ సరికొత్త మోడల్ టీవీ డిసెంబరు 2 మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది.