టిడ్కో రివర్స్ టెండరింగ్ పై అధికారులతో ఏపీ సీఎం సమీక్ష
- ప్రధాన టెండర్ల మరుసటి రోజే రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని సూచన
- ఈ రెండు టెండర్ల ప్రక్రియ మధ్య సమయం ఎక్కువగా ఉండొద్దన్న సీఎం
- ఈ నెల 22న 14,368 ఇళ్ల నిర్మాణానికి టెండరింగ్
కాగా, సమావేశంలో ఈ నెల 22న 14,368 ఇళ్ల నిర్మాణానికి టెండరింగ్ కు వెళ్తున్నామని అధికారులు వివరించారు. మిగిలిన ఇళ్లకు కూడా త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు. కాగా, ప్రధాన టెండర్ల మరుసటి రోజే రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని సీఎం సూచించారు. ఈ రెండింటి మధ్య ఎక్కువ సమయం ఉండకూడదని జగన్ పేర్కొన్నారు. దీనిపై అప్రమత్తతతో ఉండాలన్నారు.