ఈ మహోన్నత ఘట్టంలో పాల్గొనడం నా అదృష్టం: రాజ్యసభలో ప్రధాని మోదీ
- రాజ్యసభ 250వ సమావేశం
- రాజ్యసభ సభ్యులందరికీ మోదీ శుభాకాంక్షలు
- అనేక విషయాలను కొత్తకోణంలో చూసే అదృష్టం కలిగిందన్న మోదీ
కాలమాన పరిస్థితులతో పాటు మారేందుకు రాజ్యసభ కృషి చేసిందని ప్రశంసించారు. రాజ్యసభ చరిత్ర సృష్టించిందని, చరిత్ర మార్చడంలో తన వంతు కృషి చేసిందని కొనియాడారు. నిష్ణాతుల అనుభవాలు దేశానికి ఉపయోగపడేలా ఈ సభ సహకరిస్తుందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వల్ల దేశానికి ఎంతో మేలు కల్గిందని ప్రశంసించిన మోదీ, మన ఆలోచనలే ఉభయసభల ఔన్నత్యాన్ని చాటుతాయని భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారని గుర్తుచేసుకున్నారు. రాధాకృష్ణన్ మాటల విలువను తగ్గిస్తున్నామా, పెంచుతున్నామా అనేది గుర్తించాలని కోరారు.