Sujeeth: శర్వానంద్ తో 'సాహో' దర్శకుడు!
- 'రన్ రాజా రన్'తో హిట్
- విమర్శలు తెచ్చిపెట్టిన 'సాహో'
- మరో కథపై కసరత్తులు పూర్తిచేసిన సుజీత్
తెలుగు తెరకు 'రన్ రాజా రన్' సినిమా ద్వారా దర్శకుడిగా సుజీత్ పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలోనే ఆయన సక్సెస్ ను సాధించాడు. ఆ సినిమా సాధించిన విజయం కారణంగా, రెండవ సినిమానే ప్రభాస్ తో చేసే ఛాన్స్ దక్కింది. అలా ప్రభాస్ తో ఆయన 'సాహో' అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందించాడు.
అయితే ప్రభాస్ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. కథ లేకుండా ఖర్చు పెట్టించాడనే విమర్శలు వినిపించాయి. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న సుజీత్, శర్వానంద్ కోసం ఓ కథను సిద్ధం చేశాడట. రేపో మాపో ఆయన ఆ కథను శర్వానంద్ కి వినిపించనున్నాడని అంటున్నారు. శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, సుజీత్ తదుపరి సినిమా ఆయనతోనే ఉంటుంది. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.