: అవినీతి, అక్రమార్జన గుర్రపుడెక్క మాదిరిగా అల్లుకుపోయాయి: బాబు
చంద్రబాబు నాయుడును హైదరాబాదులోని వాకర్స్ అసోసియేషన్లు ఈ రోజు ఘనంగా సత్కరించాయి. ప్రజాసమస్యల పరిష్కారానికి సుదీర్ఘ పాదయాత్ర చేసినందుకు ఆయనను సత్కరించినట్టు సంఘాల సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ఆర్ధిక సంస్కరణల ఫలితాలు సామాన్యులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. అవినీతి, అక్రమార్జన చెరువుల్లోని గుర్రపుడెక్క మాదిరిగా అల్లుకుపోయాయని ఆయన అన్నారు.