: హైదరాబాద్ బయలుదేరిన సీఎం
సీఎం ఢిల్లీ నుంచి ఎట్టకేలకు హైదరాబాద్ కు బయలుదేరారు. నాలుగు రోజులుగా హస్తినలో మకాం వేసిన సీఎం కాంగ్రెస్ అధిష్ఠానంతో పలుదఫాలు చర్చలు జరిపారు. కళంకిత మంత్రులపై, రాష్ట్ర రాజకీయ స్థితిగతులపై చర్చించారు. ఐదు దఫాలు రాష్ట్ర వ్వవహారాల ఇన్ఛార్జ్ ఆజాద్ తో సమావేశమైన కిరణ్ కుమార్ రెడ్డి, రెండుసార్లు పార్టీ అధినేత్రి సోనియాతో భేటీ అయ్యారు. సీఎం ఎడతెగని చర్చల్లో మేడం ఎటువైపు మొగ్గు చూపారో, ఏ నిర్ణయం తీసుకున్నారో అని మంత్రులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.