: సినీ హాస్యనటుడు అలీకి డాక్టరేట్
ప్రముఖ తెలుగు చలన చిత్ర హాస్యనటుడు అలీకి యూరోపియన్ యునైటెడ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ నెల25న కోయంబత్తూరు యూనివర్సిటీలో డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నారు. గత మూడు దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకులను నవ్వుల లోకంలో ముంచెత్తుతున్న అలీకి డాక్టరేట్ రావడంపై పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'సీతాకోక చిలుక' సినిమా ద్వారా బాలనటుడిగా సినీ రంగప్రవేశం చేసిన అలీ కామెడీకి ఫిదా అవని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకుల్లోనే కాకుండా సినీ హీరోల్లో కూడా అలీ కామెడీకి అభిమానులున్నారు. పవన్ కల్యాణ్ తన ప్రతి సినిమాలోనూ అలీని జోడీగా పెట్టుకుంటారు. దర్శకుడు పూరి జగన్నాథ్ అయితే అలీ కోసం ప్రత్యేకంగా కామెడీ ట్రాక్స్ సృష్టిస్తారు.