: ఫిక్సింగ్ మనీ స్వాధీనానికి మూడు నగరాలకు పోలీసులు


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ పై దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు ఈ కేసులో క్రికెటర్లకు ముట్టిన సొమ్ములను స్వాధీనం చేసుకోవడానికి చర్యలు ప్రారంభించారు. అహ్మదాబాద్, కోల్ కతా, ముంబై నగరాలకు ప్రత్యేక బృందాలు వెళ్లాయని తెలుస్తోంది. శ్రీశాంత్, అజిత్ చండీలా అరెస్ట్ కు ముందే బుకీల నుంచి డబ్బులు పుచ్చుకోగా.. చవాన్ ఇంకా తీసుకోవాల్సి ఉంది. అయితే అసలు క్రికెటర్లకు ఎంత మొత్తం ముట్టింది? వంటి వివరాలను ఆరాతీయడంతోపాటు, వాటి స్వాధీనానికి ప్రత్యేక బృందాలు బయల్దేరి వెళ్లాయి. ఈ నగరాల నుంచి బుకీలు కార్యకలాపాలు నడిపించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News