Jagan: లంచాలు, మోసాలకు తావులేకుండా ఉద్యోగాలు.... ఏపీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను ప్రారంభించిన సీఎం జగన్
- ఆప్కాస్ వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం
- మధ్యవర్తులు లేకుండా ఉద్యోగాలు
- ఎన్నికల హామీ నిలబెట్టుకున్నామని వెల్లడి
సీఎం వైఎస్ జగన్ ఏపీ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను ప్రారంభించారు. ఎన్నికల హామీ మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్ కు సంబంధించి వెబ్ సైట్ (ఏపీ ఆప్కాస్) ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మధ్యవర్తులు లేకుండా, మోసాలకు, లంచాలకు తావులేని విధంగా నిరుద్యోగులకు మేలు జరిగేందుకే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఇక నుంచి ఈ కార్పొరేషన్ ద్వారానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయిస్తామని, జిల్లాస్థాయిలో 50 శాతం ఉద్యోగాలు మహిళలకే ఇచ్చేలా నిర్ణయించామని వివరించారు.