ఎంఎంటీఎస్-హంద్రీనీవా ఎక్స్‌ప్రెస్ ఢీ ఘటన.. ఎంఎంటీఎస్ చరిత్రలో అతిపెద్ద దుర్ఘటన
- 2003లో ప్రారంభమైన ఎంఎంటీఎస్ సేవలు
- రోజుకు 121 సర్వీసులు
- ప్రతి రోజు 1.60 లక్షల మంది రాకపోకలు
ఈ క్రమంలో, ఎంఎంటీఎస్ 16 ఏళ్ల చరిత్రలో నిన్న జరిగిన ప్రమాదమే అతి పెద్ద దుర్ఘటన అని అధికారులు తెలిపారు. కాచిగూడ నుంచి సికింద్రాబాద్ వైపు వస్తున్న రైలు.. కర్నూలు వెళ్లడానికి సిద్ధంగా వున్న హంద్రీనీవా ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికిపైగా గాయపడ్డారు. క్యాబిన్లో చిక్కుకుపోయిన ఎంఎంటీఎస్ రైలు లోకోపైలట్‌ను 8 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత రక్షించారు. అతడికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.