ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై హైకోర్టుకు నివేదిక అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
- ఆర్టీసీ ఎస్మా పరిధిలోకి వస్తుందన్న పిటిషనర్
- సమ్మె చట్ట విరుద్ధమని చెప్పలేమన్న హైకోర్టు
- పబ్లిక్ యుటిలిటీ సర్వీసులన్నీ ఎస్మా కిందికి రావన్న కోర్టు
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గ నిర్ణయాన్ని కూడా కోర్టుకు వెల్లడించింది. మరోవైపు హైకోర్టు తన విచారణలో సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్ లను కలిపి విచారణ జరుపుతామని పేర్కొంది. సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయిందని కోర్టు ప్రకటించింది. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించే అధికార పరిధి హైకోర్టుకు ఉందన్న పిటిషనర్ తన వాదనను నిరూపించుకోవాలని ఆదేశించింది. ఆర్టీసీ ఎస్మా(అత్యవసర సర్వీసులు) పరిధిలోకి వస్తుందని పిటిషనర్ పేర్కొనగా, పబ్లిక్ యుటిలిటీ సర్వీసులన్నీ ఎస్మా కిందికి రావని కోర్టు తెలిపింది. ఆర్టీసీ సేవలను ఎస్మా పరిధిలోకి తెస్తూ.. జీవో జారీచేస్తేనే అవి అత్యవసర సర్వీసులుగా ఉంటాయని హైకోర్టు తెలిపింది.