ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సాహ్ని?.. రెండో స్థానంలో ఉన్నా ఆమె వైపే ప్రభుత్వం మొగ్గు!
- విజయసాయిరెడ్డితో కలిసి నిన్న అమరావతికి సాహ్ని
- జగన్‌తో భేటీ, భోజనం
- మొదటి స్థానంలో ఉన్న ప్రీతికి దక్కని అవకాశం?
నిజానికి సీనియారిటీ ప్రకారం చూస్తే 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి ప్రీతి సూదన్ ముందున్నారు. ప్రీతి సూదన్ ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్నారు. ప్రీతి సహా మరికొందరి పేర్లు సీఎస్ రేసులో వినిపిస్తున్నా ప్రభుత్వం మాత్రం రెండో స్థానంలో ఉన్న నీలం సాహ్ని వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.