Jagan: నవంబరు 1న అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు
- నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
- విజయవాడ, ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో వేడుకలు
- ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్
నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు అధికారికంగా జరగనున్నాయి. ఈ మేరకు సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకు అధికారికంగా నవంబరు 1న అవతరణ వేడుకలు నిర్వహించలేదన్న విషయం తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత తొలిసారి ఈ వేడుకలను నిర్వహిస్తుండడంతో జగన్ ప్రభుత్వం వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తారు. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథి హాజరవుతారు. ఈ వేడుకల్లో మొదటి రోజు హస్త, చేనేత కళల ప్రదర్శనలు, రెండవ రోజు కూచిపూడి, లలిత, జానపద కళల ప్రదర్శనలు, మూడవ రోజు తెలుగు సంప్రదాయ ఆహార ఉత్పత్తుల ప్రదర్శనలు ఉంటాయి.