: ఇక ఫ్రాన్స్ లోనూ 'గే' పెళ్లిళ్లు
ఫ్రాన్స్ లో ఇకమీదట మగాళ్లు, మగాళ్లు పెళ్లాడొచ్చు. ఆడాళ్లు, ఆడాళ్లు కలిసి జీవితాన్ని పంచుకోవచ్చు. ఈ మేరకు స్వలింగ వివాహాలకు అనుమతించే చట్టంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండే సంతకం చేశారు. దీంతో స్వలింగ వివాహాలను అనుమతించిన 14వ దేశంగా ఫ్రాన్స్ పేరు నిలిచిపోనుంది. దీనిపై అక్కడ విపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా హోలండే ముందుకే వెళ్లారు. గే వివాహాలకు జై కొట్టారు!