: కడపలో ఏనుగుల బీభత్సం
అరణ్యాలు కనుమరుగైపోతుండడంతో అడవి జంతువులు పంటచేలల్లోకి చొరబడుతున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఎస్ కొత్తపల్లిలో ఇలాగే ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మామిడి తోటలపై దాడి చేసి పంటను ధ్వంసం చేసాయి. ఏనుగుల దాడిలో రెండు విద్యుత్ మోటార్లు ధ్వంసం అయ్యాయి. ఏనుగులు ఒక్కసారిగా తోటలపై పడడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.