: ఇంతకీ ... మన ప్రధాని వయసెంత?
ప్రధాని మన్మోహన్ సింగ్ వయసుపై చిన్న గందరగోళం నెలకొంది. ఆయనకు 80 ఏళ్లా? లేక 82 ఏళ్లా? అన్నది సందేహంగా మారింది. ప్రధాని అసోం నుంచి రాజ్యసభ స్థానానికి మూడు రోజుల కిందట నామినేషన్ వేశారు. అందులో తన వయసు 82 ఏళ్లుగా పేర్కొన్నారు. మన్మోహన్ వెబ్ సైట్ లో ఆయన పుట్టిన తేదీ 1932, సెప్టెంబర్ 16 అని ఉంది. ఈ లెక్కన చూస్తే ఆయన వయసు గత సెప్టెంబర్ కు 80ఏళ్లు. మరి, మన్మోహన్ జీ 82 అని ఎలా చెప్పారు? 2007 నామినేషన్ సమయంలో మన్మోహన్ తన వయసు 74 ఏళ్లుగా పేర్కొన్నారు. అలా చూసినా ఆయన వయసు 80 ఏళ్లే. మరి 82 ఎక్కడి నుంచి వచ్చింది? అన్నదే ఇప్పుడు సమాధానం లేని ప్రశ్న.