ఉప ఎన్నికల్లో డీఎంకేకు షాకిచ్చిన తమిళ ఓటర్లు : రెండు స్థానాల్లోనూ వెనుకబాటే
- ఆశ్చర్యపోతున్న రాజకీయ వర్గాలు
- ఇక అధికారానికి ఆమడ దూరంలోనే అని ప్రచారం
- ఇంతలోనే ఈ మార్పు దేనికి సంకేతం?
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 39 ఎంపీ స్థానాలకుగాను 22 స్థానాలను గెల్చుకుని డీఎంకే మంచి జోరుమీదున్నట్టు కనిపించింది. ఉప ఎన్నికల్లోనూ ఇదే జోరు కనిపిస్తుందని అంతా భావించారు. కానీ, ఓటర్లు షాక్ ఇవ్వడంతో డీఎంకే వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
మరోవైపు వరుసగా ఎదురు దెబ్బలతో కొట్టుమిట్టాడుతున్న అన్నాడీఎంకేకు ఈ ఉప ఎన్నికల ఫలితం జీవం పోస్తుందనడంలో సందేహం లేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో అప్పుడే అంచనా వేయలేం.