: ఇక ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను నివారించవచ్చు


పురుషుల్లో ఎక్కువగా కనిపించే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను సమూలంగా నిర్మూలం చేసే కొత్త మందుకు అమెరికా ఆమోద ముద్ర వేసింది. పురుషుల్లో టెస్టోస్టీరాన్‌ హార్మోన్ల స్థాయిని నిలువరించే చికిత్స తీసుకున్న అనంతరం ఈ మందును ఉపయోగించాలని అమెరికా ఆహార, వైద్య శాఖ సూచిస్తోంది. ఎముకలకు వ్యాపించే ఈ క్యాన్సర్‌ కణాలను ‘సోఫిగో’ అనే మందును ఉపయోగించి సమూలంగా నాశనం చేయవచ్చని ఆ శాఖ చెబుతోంది. ఎముకల్లోని ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కణాలను సమూలంగా నాశనం చేయడంలో సోఫిగో విజయవంతంగా పనిచేసింది. సుమారు 809 మంది పురుషులపై చేసిన పరిశోధనల్లో ఈ మందు అత్యంత ప్రభావవంతంగా పనిచేయడంతో మూడు నెలలకు ముందే ఈ మందుకు అమెరికా ఆహార, వైద్య శాఖ ఆమోద ముద్ర వేసింది.

  • Loading...

More Telugu News