Chandrababu: తప్పును ఎత్తి చూపించే వాళ్ల నోళ్లు నొక్కేయాలనుకోవడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం: చంద్రబాబు
- ట్విట్టర్ లో చంద్రబాబు వ్యాఖ్యలు
- పాత్రికేయులపై దాడులను ప్రశ్నించిన వైనం
- ఎందుకింత భయపడుతున్నారంటూ నిలదీసిన చంద్రబాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. తప్పులను ఎత్తిచూపించే వాళ్ల నోళ్లు నొక్కేయాలనుకోవడం వైసీపీ సర్కారు పిరికితనానికి నిదర్శనం అని ట్వీట్ చేశారు. కొన్నిరోజులుగా రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటు వాక్ స్వాతంత్ర్యాన్ని కూడా కల్పించిందని, ఆ హక్కులను హరించడం అప్రజాస్వామికం అని మండిపడ్డారు. చేసే పనుల పట్ల చిత్తశుద్ధి, నమ్మకం ఉంటే ఎందుకింత భయపడుతున్నారని వైసీపీ సర్కారును నిలదీశారు. అంతేకాదు, ఎప్పట్లాగానే 'జగన్ ఫెయిల్డ్ సీఎం' అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు.