Andhra Pradesh: తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు: చంద్రబాబునాయుడు
- దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలకూ శుభాకాంక్షలు
- అందరూ కలిసిమెలిసి జీవించాలి
- ప్రతి కుటుంబంలో సుఖశాంతులు నిండాలి
దసరా పండగను పురస్కరించుకుని తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలకూ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వంతో అందరూ కలిసిమెలిసి జీవించాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు నిండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్టు చెప్పారు.