52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా... వైజాగ్ పిచ్ పై మరింత స్పిన్!
- ఐదో రోజున రెండు వికెట్లు తీసిన షమీ
- డక్కవుట్ అయిన బవుమా
- వర్షం పడుతుందంటున్న వాతావరణ శాఖ
ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే సౌతాఫ్రికా జట్టు 395 పరుగులు సాధించాలి. అది అసాధ్యమే. ఇక భారత జట్టుకు మరో ఆరు వికెట్లు కావాలి. విశాఖ పిచ్ తొలి నాలుగు రోజులతో పోలిస్తే, నేడు స్పిన్, సీమ్ కు మరింతగా అనుకూలిస్తుండటంతో భారత్ విజయం ఖాయమనే చెప్పవచ్చు. అయితే, ఆకాశం మేఘావృతమై ఉండటం, వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడమే భారత క్రికెట్ అభిమానులకు కాస్తంత ఆందోళన కలిగిస్తోంది.