వైజాగ్ టెస్ట్: తొలి ఇన్నింగ్స్ ను 502/7 వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా
- మయాంక్ డబుల్ సెంచరీ
- రోహిత్ భారీ శతకం
- పటిష్టమైన స్థితిలో టీమిండియా
పుజారా (6), కెప్టెన్ కోహ్లీ (20), రహానే (15), విహారి (10) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. జడేజా 30 పరుగులతో నాటౌట్ గా నిలవగా, వికెట్ కీపర్ సాహా 21 పరుగులు సాధించాడు. ఈ తరుణంలో టీ బ్రేక్ తర్వాత కాసేపటికే కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా జట్టు వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. ఓపెనర్లు డీన్ ఎల్గార్ (8), ఐడెన్ మార్ క్రమ్ (0) క్రీజులో ఉన్నారు.