: శిల్పాశెట్టి, ద్రావిడ్ లను విచారించనున్న పోలీసులు
స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో రాజస్థాన్ రాయల్స్ సహయజమాని శిల్పాశెట్టితో పాటు ఆమె భర్త రాజ్ కుంద్రా, కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ లు పోలీసు విచారణ ఎదుర్కోనున్నారు. ఈ వ్యవహారంలో రాయల్స్ ఆటగాళ్ళు శ్రీశాంత్, చండీలా, చవాన్ లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో శిల్పా శెట్టి, కుంద్రా, ద్రావిడ్ లను ఈ నెల 21న ప్రశ్నించనున్నారు.