దాంపత్యంపై మాంద్యం ప్రభావం.. అర్జెంటినాను వణికిస్తున్న ఆర్థిక మాంద్యం!
- డాలర్‌తో పోలిస్తే దిగజారిన పెసో విలువ
- ఆర్థిక మాంద్యం దెబ్బకు విలవిల్లాడుతున్న దక్షిణ అమెరికా దేశం
- ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ వల్లే ఈ దుస్థితి అన్న నటుడు గిల్లెర్మో
దక్షిణ అమెరికాలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన అర్జెంటినా ఇలాంటి దుస్థితి ఎదుర్కోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ వల్లే ఇలా జరిగిందని అర్జెంటినా ప్రముఖ నటుడు గిల్లెర్మో అక్వినో ఆవేదన వ్యక్తం చేశాడు. దేశ కరెన్సీ విలువ పడిపోవడం తనను చాలా బాధకు గురిచేస్తోందన్నాడు.
పెసో విలువ ఒక్కసారిగా పడిపోవడంతో అర్జెంటినాలో కండోముల ధరలు ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 36 శాతం పెరిగాయి. దీంతో చాలామంది వాటిని కొనడం మానేశారు. నెలకు 1.44 లక్షల మంది మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడడం మానేశారని అర్జెంటినా ఫార్మాస్యూటికల్ కాన్ఫెడరేషన్ అధ్యక్షురాలు ఇసబెల్ రెనోసో తెలిపారు.