కర్నూలు జిల్లాలో ‘గద్దలకొండ గణేష్’ రిలీజ్ ను నిలిపివేసిన కలెక్టర్!
- తొలుత వాల్మీకి అని పేరుపెట్టిన నిర్మాతలు
- హైకోర్టుకు వెళ్లిన వాల్మీకి సంఘాల ప్రతినిధులు
- కోర్టు ఆదేశాలతో టైటిల్ మార్చిన నిర్మాతలు
హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పుడు కొత్త తలనొప్పి ఎదురయింది. నేడు కర్నూలు జిల్లాలో ‘గద్దలకొండ గణేష్’ సినిమా రిలీజ్ ను కలెక్టర్ నిలిపివేశారు. ఏపీ హైకోర్టు నుంచి తమకు అధికారిక ఆదేశాలు ఇంకా అందలేదనీ, అందుకే సినిమాను ప్రదర్శించడం లేదని స్పష్టం చేశారు. దీంతో కర్నూలులో ఈ సినిమా ప్రదర్శన ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న విషయమై అస్పష్టత నెలకొంది. ఈరోజు గద్దలకొండ గణేష్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.