ఎడతెగని వర్షాలకు మహానందిలో రోడ్లు జలమయం.. కొట్టుకువచ్చిన మొసలి!
- సలీమ్ నగర్ వీధుల్లో మోకాలి లోతు వరకు వరదనీరు
- నీటిలో తిరుగుతున్న మొసలిని గమనించిన స్థానికులు
- మొసలిని బంధించిన అటవీశాఖ సిబ్బంది
వరద నీటిలో మొసలి కొట్టుకువచ్చిన విషయాన్ని అటవీ శాఖ డివిజనల్ కార్యాలయానికి ఫోన్ ద్వారా స్థానికులు తెలియజేశారు. ఈ సమాచారం మేరకు సలీమ్ నగర్ కు వెళ్లిన అటవీశాఖ సిబ్బంది, మొసలిని బంధించారు. దానిని శ్రీశైలం రిజర్వాయర్ లో వదిలివేస్తామని సిబ్బంది తెలిపారు.