ధనవంతుల బీపీఎల్ రేషన్ కార్డులపై యడియూరప్ప సర్కారు కొరడా
- ధనవంతుల చేతుల్లో పడి దుర్వినియోగం అవుతున్న రేషన్ కార్డులు
- స్వచ్ఛందంగా అప్పగించేందుకు ఈ నెల 30 వరకు గడువు
- పట్టించిన వారికి భారీ నజరానా
ధనవంతుల వద్ద ఉన్న రేషన్ కార్డుల గురించి సమాచారం అందించిన వారికి భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ తెలిపారు. అలాగే, ధనవంతులు తమ వద్ద ఉన్న బీపీఎల్ కార్డులను స్వచ్ఛందంగా అప్పగించేందుకు ప్రభుత్వం ఈ నెల 30 వరకు గడువు విధించింది. ఆపై రేషన్ కార్డుతో దొరికిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.