ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది: నిర్మలా సీతారామన్
- తయారీ రంగం వృద్ధి రేటు 0.6 శాతానికి పడిపోయింది
- ఎగుమతులపై పన్ను తగ్గింపుపై పునరాలోచిస్తున్నాం
- క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ తో పరిస్థితులు మెరుగుపడతాయి
కొత్త ఎగుమతులకు ప్రోత్సాహక విధానాన్ని అమలు చేస్తామని... ఉపాధిని కల్పించే రంగాలను ప్రోత్సహిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. టెక్స్ టైల్ రంగానికి ప్రోత్సాహకాలు, మినహాయింపులు ఈ ఏడాది చివరి వరకు కొనసాగుతాయని తెలిపారు. ఎంఈఐఈఎస్ పథకం అమలుతో ఎగుమతులు భారీగా పెరుగుతాయని చెప్పారు. ప్రభుత్వ బ్యాంకుల్లో రుణ వితరణ పెరుగుతోందని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ స్థానం మెరుగుపడిందని వెల్లడించారు. ఈ నెల 19న బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు.