Mahila commission: ఏపీ మహిళా కమిషన్ నుంచి త్వరలో హెల్ప్ లైన్ ప్రారంభిస్తాం: వాసిరెడ్డి పద్మ
- ‘సామాజిక మాధ్యమాలు-మహిళల భద్రత’పై సదస్సు
- ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం
- మహిళల భద్రతపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తాం
ఏపీ మహిళా కమిషన్ నుంచి త్వరలో ‘హెల్ప్ లైన్’ ను ప్రారంభిస్తామని చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ‘సామాజిక మాధ్యమాలు-మహిళల భద్రత’ అనే అంశంపై రాజమహేంద్రవరంలో ఈరోజు నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్టు చెప్పారు. మహిళల భద్రతపై అన్ని కళాశాలల్లో అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని అన్నారు.