భారత శాస్త్రవేత్తలకు పదేళ్ల బాలుడి లేఖ... వైరల్!
- చంద్రయాన్-2 విఫలమైనా ఇస్రోకు ప్రశంసలు
- చంద్రయాన్-3 లక్ష్యంగా ముందుకు సాగండి
- ఆర్బిటర్ పంపే చిత్రాలు కూడా కీలకమేనన్న బాలుడు
తన లేఖలో ఆ బాలుడు శాస్త్రవేత్తలకు ధైర్యాన్ని చెప్పాడు. ఇండియా తప్పకుండా చంద్రుడిని చేరుతుందన్న నమ్మకం ఉందన్నారు. వచ్చే సంవత్సరం జూన్ లో చేపట్టే 'చంద్రయాన్-3' లక్ష్యంగా సాగాలని సూచించాడు. ఆర్బిటర్ ఇంకా చంద్రుడి కక్ష్యలోనే తిరుగుతోందని, అది పంపే ఫోటోలు కూడా కీలకమేనని అన్నాడు. భవిష్యత్తులో వ్యోమగాములు ఎక్కడ దిగాలన్న విషయాన్ని అదే చెబుతుందని, ఎక్కడ విత్తనాలను నాటాలో మనకు ముందుగానే తెలుస్తుందని అన్నాడు.
విక్రమ్ తప్పకుండా ల్యాండ్ అయ్యే ఉంటుందని, ప్రజ్ఞాన్ కూడా పని చేస్తూనే ఉందని అనుకుంటున్నానని, అది గ్రాఫికల్ బ్యాండ్స్ ను భూమిపైకి పంపించేందుకు సిద్ధమవుతూ ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. తన వంటి తదుపరి తరం పిల్లలకు శాస్త్రజ్ఞులే స్ఫూర్తిదాయకమన్నాడు.