: మంత్రులపై వేటు లేనట్లే!
రాష్ట్ర కేబినెట్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించాల్సిన అవసరం లేదని సీఎం అభిప్రాయపడుతున్నారు. గత మూడు రోజులుగా హస్తినలో మకాం వేసిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నేటి సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. కళంకిత మంత్రులు, రాష్ట్ర వ్యవహారాలపై అధిష్ఠానం పెద్దలతో చర్చించిన సీఎం... మంత్రులు ఎలాంటి అవినీతికీ పాల్పడలేదని, జగన్ అక్రమాస్తులతో వారికే సంబంధం లేదని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికిప్పుడు మంత్రులపై ఏ రకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఢిల్లీలోని పెద్దలకు విన్నవించిన సీఎం హైదరాబాద్ చేరుకున్న తరువాత కార్యాచరణ ప్రకటించనున్నారు.