రాజకీయ కక్ష... చట్టం కన్నా ఎంతో భయానకం: పోలీసు స్టేషన్ నుంచి డీకే శివకుమార్ సంచలన వీడియో!
- మంగళవారం అరెస్ట్ అయిన శివకుమార్
- 14 రోజుల కస్టడీ విధించిన న్యాయస్థానం
- ట్విట్టర్ లో వీడియో పోస్ట్
కర్ణాటక ప్రజలను ఉద్దేశించి తాను మాట్లాడాల్సి వుందని, అందుకు అనుమతి ఇవ్వాలని శివకుమార్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిన గంటల వ్యవధిలో ఈ వీడియో విడుదల కావడం తీవ్ర కలకలాన్ని రేపింది. కాగా, మంగళవారం నాడు శివకుమార్ ను మనీ లాండరింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అంతకు నాలుగు రోజుల ముందు నుంచి ఆయన్ను ప్రశ్నిస్తున్న అధికారులు, కేసులో ప్రాథమిక సాక్ష్యాలు లభ్యమయ్యాయని చెబుతూ, శివకుమార్ ను అరెస్ట్ చేశారు.