: ఆరుషి కేసులో తల్వార్ దంపతుల వాంగ్మూలం


సంచలనం సృష్టించిన ఆరుషి కేసులో ఆమె తల్లిదండ్రుల వాంగ్మూలం తీసుకోవాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. 2008లో టీనేజర్ ఆరుషి నోయిడాలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ మరుసటి రోజే వారి పనివాడు హేమరాజ్ కూడా ఇంటి టెర్రస్ పై విగతజీవుడిలా కనిపించాడు. దీంతో, ఈ జంటహత్యలు ఆరుషి తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నూపుర్ తల్వార్ ల పనే అని సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది.

కాగా, ఈ కేసులో మరో 14 మంది వాంగ్మూలం తీసుకోవాలని తల్వార్ దంపతులు కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఇలా నేరుగా తమ వద్దకు రావడం సరికాదని అత్యున్నత న్యాయస్థానం వారికి చీవాట్లు పెట్టింది. ఈ నేపథ్యంలో నేడు తల్వార్ దంపతుల వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని ఘజియాబాద్ సీబీఐ కోర్టు భావిస్తోంది.

  • Loading...

More Telugu News