: గోసంరక్షణపై దేవాదాయ మంత్రి సమీక్ష
రాష్ట్రంలోని దేవాలయాలలో గోవుల సంరక్షణ తీరుతెన్నులపై ఆ శాఖ మంత్రి రామచంద్రయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. వాటి సంరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అన్న విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇందులో దేవాదాయ శాఖ అధికారులతోపాటు, పలు ధార్మిక సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. సింహాచలం దేవస్థానం పరిధిలోని గోసంరక్షణాలయంలో నెలరోజుల్లో 150 కోడెదూడలు మృతి చెందడం, అలాగే వేములవాడ దేవాలయంలోనూ ఇలాంటి ఘటనే జరగడంతో మంత్రి ఈ సమావేశాన్ని నిర్వహించారు.